చంద్రబాబు నాయుడు అప్పుడెందుకు జోలె పట్టలేదు

టిడిపి నేతలంతా కోటీశ్వరులైనప్పుడు చంద్రబాబు జోలె ఎందుకు పడుతున్నారు

thopudurthi prakash reddy
thopudurthi prakash reddy

అనంతపురం: టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాయలసీమ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, లక్షలమంది వలసలు వెళ్లినప్పుడు జోలె పట్టని చంద్రబాబునాయుడు ఇప్పుడెందుకు జోలె పడుతున్నారని వెస్సాఆర్‌సిపి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి నేతలంతా కోటీశ్వరులైనప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు జోలె పడుతున్నారని తోపుదుర్తి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు. అమరావతి ఓ భ్రమరావతి అని, చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో గ్రాఫిక్స్‌తో కాలయాపన చేశారని దుయ్యబట్టారు. గత టిడిపి ప్రభుత్వం హయంలో రూ.లక్షల కోట్లు దోచుకున్నారని తోపుదుర్తి ఆరోపించారు. రాజధాని విషయంలో టిడిపి నేతలు చెప్పె మాటలు విని రైతులు మోసపోవద్దని ప్రకాష్‌ రెడ్డి కోరారు. లక్షల కోట్ల రుపాయల రాజధాని వద్దని సాగునీటి ప్రాజెక్టులే ముద్దని ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

తాజా క్రీడా వార్త కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/