చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన రోజా

mla roja
mla roja

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ వేదికపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా కాకుండా పనికిమాలిన నాయకుడిగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శలు చేశారు. ఇంకా చంద్రబాబు వయసు పెరిగే కొద్దీ చాదస్తం కూడా పెరుగుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబును ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ ఇప్పించాలని టిడిపి సభ్యులకు సలహ ఇచ్చారు. చంద్రబాబు గట్టిగా అరిస్తే గడ్డిపరక సింహం కాదని సెటైర్‌ వేశారు. ఇంకా తాము ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు చేస్తుంటే మమ్మల్ని బయటకు లాగేశారని రోజా అన్నారు. కాల్‌ మనీ, సెక్స్‌ రాకెట్‌ను తాను ఆనాడు ప్రస్తావిస్తే ‘కామ సీఎం్ఞ అని తాను అన్నట్టు ఎల్లో మీడియాలో వార్తలు వేయించుకొని తనను అన్యాయంగా సభ నుంచి సస్పెండ్‌ చేశారని ఆమె ఆరోపించారు. తాను కోర్టుకు వెళ్లి, పోరాడి, సస్పెన్షన్‌ ఎత్తివేతపై ఆదేశాలు తెచ్చుకున్నా సభలోకి రానివ్వలేదని గుర్తు చేశారు. ఆనాడు మార్షల్స్‌తో తనను బలవంతంగా గెంటించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/