పవన్‌కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రోజా

roja
roja

అమరావతి: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై వైఎస్‌ఆర్‌సిపి మహిళా ఎమ్మెల్యే రోజా విమర్శల దాడికి దిగారు. రాజధాని నిర్మాణానికి ఎన్ని ఎకరాలుండాలో ముందుగా పవన్‌ కళ్యాణ్‌ తెలుసుకోవాలని సూచించారు. లేకుంటే వైఎస్‌ఆర్‌సిపి మంత్రులు శాసనసభలో మాట్లాడిన మాటలైన వినాలని పవన్‌కు సలహా ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు అండ్‌ ఆయన కోవర్టులు ఆస్తులు కాపాడుకోవాలని తాపత్రాయపడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. కర్నూలు రాజధానిపై పవన్‌ కళ్యాణ్‌ మాట మార్చరని..గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడుకి నచ్చినట్లు పవన్‌ కళ్యాణ్‌ మాటలు మారుస్తూంటారని ఆమె విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులతో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని రోజా మండిపడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/