రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మారుద్ధాం

ఎంపీ సంతోష్‌కుమార్‌ విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన రోజా

YSRCP mla Roja accepted trs mp Santosh green challenge
YSRCP mla Roja accepted trs mp Santosh green challenge

నగరి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా తెలంగాణ స్పూర్తిగా మొక్కలు నాటుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్‌ కుమార్‌ విసిరిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ రోజా స్వీకరించింది. అందులో భాగంగా ఇవాళ నగరిలోని పుత్తూరు ఎఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 30 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లక్ష్యం అని తెలిపారు. మొక్కలు మనవాళికి జీవనాధారం అని అన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో ఐదు మొక్కలు నాటి, రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మారుద్ధామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం భాగస్వాములమవుదాం. విరివిగా మొక్కలు నాటుదామని ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/