చంద్రబాబుకు వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సవాల్‌

తనపై పోటీ చేసి గెలవాలంటూ సవాల్‌

YSRCP MLA Peddireddy challenges Chandrababu

అమరావతిః చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు కు తనపై పోటీ చేసి గెలవాలంటూ సవాల్ విసిరారు. కుప్పంలో అయినా, తంబళ్లపల్లెలో అయినా చంద్రబాబుపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని.. చంద్రబాబు రాజీనామా చేసి తనపై పోటీ చేసి గెలవాలంటూ ఛాలెంజ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబంపై చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మదనపల్లెలో జరిగిన మినీ మహానాడులో తాను చేసిన అభివృద్ధిని చంద్రబాబు చెప్పుకోలేక.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు గుప్పించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబులో సొంత వాళ్లను మోసం చేసి తాము పైకి రాలేదని, కష్టపడి పైకొచ్చామని అన్నారు. మినీ మహానాడుకు వెళ్లకుండా తాము ఎవరినీ అడ్డుకోలేదని చెప్పారు. నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేసినా… డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిస్తామని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/