దుష్ట సంప్రాదాయానికి టిడిపి తెరలేపింది

చంద్రబాబు నాయుడు ప్రభావంతోనే బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపించారు

ambati rambabu
ambati rambabu

అమరావతి: చట్ట సభల్లో దుష్ట సంప్రాదాయానికి టిడిపి తెరలేపిందని వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. మండలిలో జరిగిన పరిణామాలు ప్రజస్వామ్యానికి ఆందోళన కలిగిస్తున్నాయని..చాలా రాష్ట్రాల్లో మండలి లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు ప్రభావంతోనే బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపించారని అంబటి రాంబాబు మండిపడ్డారు. బిల్లులను తాత్కాలికంగా మాత్రమే అడ్డుకోగలరని, శాశ్వతంగా అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. బిల్లును అడ్డుకోవడం ద్వారా రాజధానిని వైజాగ్‌కు వెళ్లకుండా ఆపగలరా? అని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు మండలి చైర్మన్‌ ఎదురుగా ఎందుకు కూర్చున్నారని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/