వైఎస్‌ఆర్‌సిపి, బిజెపిలో విలీనం!

chandra babu naidu, ap cm
chandra babu naidu, ap cm


అమరావతి: ఎన్నికలయ్యాక వైఎస్‌ఆర్‌సిపిని బిజెపిలో కలపడం ఖాయమని సియం చంద్రబాబు జోస్యం చెప్పారు. దేశంలో ఉన్న నేరగాళ్లంతా ఏకమయ్యారని, ఒకే గూటికి చేరారని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపిలో 12 మంది ఎంపి అభ్యర్ధులపై, 92 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులపై కేసులున్నాయని పేర్కొన్నారు. బిజెపితో జగన్‌ లాలూచి పడ్డారని చెప్పడానికి కేంద్రమంత్రి అథవాలే వ్యాఖ్యలే నిదర్శనమని తెలిపారు. ఎన్డీఏలోకి జగన్‌ వస్తాడని అథవాలే బయటపెట్టారని చెప్పారు. కేసుల భయం చూపి జగన్‌ను బిజెపి లొంగదీసుకుందన్నారు. కేసుల మాఫీ కోసం మోదికి పార్టీని తాకట్టు పెట్టిన ఘనత జగన్‌దేనని ధ్వజమెత్తారు. ఇక హైదరాబాద్‌లో ఆస్తులు కాపాడుకోవడానికి కేసిఆర్‌కు పార్టీని అమ్మేశాడని ఎద్దేవా చేశారు. అధికారుల బదిలీలతో టిడిపికి అధికారం దూరం చేయలేరని, గెలుపు ఏకపక్షమేనని అన్నారు. మోది దర్యాప్తు సంస్థలనే కాకుండా ఈసిని కూడా దుర్వినియోగం చేస్తున్నారని, తప్పుడు మార్గాలతో అధికారంలోకి వచ్చి కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/