నేడు ఈసీకి ఫిర్యాదు చేయనున్న వైఎస్‌ఆర్‌సిపి నేతలు

YSRCP
YSRCP

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఈరోజు ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. ఏపిలో ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సిపిని … అధికార టిడిపి ఇబ్బంది పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ నేతలు నేడు ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు అవకతవకలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేయనున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డిలతో కూడిన బృందం కలసి ఈసీకి ఫిర్యాదు చేయనుంది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సిపి ప్రధాన కార్యలయం బుధవారం సాయంత్రం ఒక ప్రకటనను విడుదల చేసింది.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/