ఈసీని కలిసిన వైఎస్‌ఆర్‌సిపి నేతలు

YSRCP
YSRCP

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు, సీనియర్‌ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను కలిశారు. ఏపిలో రీపోలింగ్‌లో భద్రత పెంచాలని వారు ఈసీని కోరారు. కౌంటింగ్ ప్రక్రియను సీసీ కెమెరాలతో పర్యవేక్షించాలని కోరారు. కౌంటింగ్ రోజున టీడీపీ అలజడులు సృష్టించే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత పెంచాలని ఈసీకీ విజ్ఞప్తి చేశామని వైసీపీ పేర్కొంది. శాంతియుతంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని కోరినట్లు పార్టీ నేతలు వివరించారు.వీటికి సంబంధించిన మార్గదర్శకాలను ఎన్నికల సంఘం వెంట‌నే వెలువరించాలని వైసీపీ నేతలు ఎన్నిక‌ల సంఘానికి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. సీఈసీని కలిసిన వారిలో ఎంపీ విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, బుట్టా రేణుక, రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/