కరోనా పై బాధ్యతారహితమైన ప్రకటనలు చేశారు

వైఎస్‌ఆర్‌సిపి కార్యక్రమాల వల్లే కరోనా విస్తరించింది

devineni uma
devineni uma

అమరావతి: టిడిపి నేత దేవినేని ఉమ సిఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు అట్టహాసంగా చేపట్టిన నిత్యావసరాల పంపిణీ, మార్కెట్ కమిటీ ప్రారంభోత్సవాలు, ఊరూ వాడా జయంతి ఉత్సవాలతో కరోనా వ్యాప్తి చెందిందని విమర్శించారు. ఏపిలో కట్లు తెంచి కరోనాను పోషించిన మీ ప్రజాప్రతినిధులు పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని… ఇదే సౌకర్యాన్ని ప్రజలకు కూడా కల్పించాలి జగన్ గారూ అని వ్యాఖ్యానించారు.

కరోనా గురించి జగన్ బాధ్యతారహితమైన ప్రకటనలు చేశారని మండిపడ్డారు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ చల్లితే పోతుంది, కరోనా ఎవరికైనా వస్తుంది, పోతుంది, కరోనా కేసులు పెరుగుతూ పోతాయి, రాబోయే రోజుల్లో కరోనా రాని వారు ఎవరూ ఉండరని మీరు చెప్పిన మాటలను ఈరోజు నిజం చేసి చూపించారని మండిపడ్డారు. మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏయే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో చెప్పే ధైర్యం మీకు ఉందా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి అధికారుల వరకు ఎవరూ మాస్కులు పెట్టుకోవడం లేదని మండిపడ్డారు.వైఎస్‌ఆర్‌సిపి నేతలెవరూ కరోనా నిబంధనలను పాటించలేదని… కరోనా పెరగడానికి మీరే కారణమని దేవినేని ఆరోపించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/