ఓటేసిన వైఎస్‌ షర్మిల

YS Sharmila
YS Sharmila

పులివెందుల: వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతు యువత పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటోందని ఆమె అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితి చూస్తే.. మళ్లీ రాజన్న రాజ్యం రాబోతుందని అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి వల్లే ప్రత్యేక హోదా ఉద్యమం సజీవంగా ఉందని, ప్రతి జిల్లాలనూ యువభేరి కార్యక్రమాలతో హోదా పట్ల యువతలో వైఎస్‌ జగన్‌ అవగాహన పెంచారని షర్మిల తెలిపారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/