ఏపిలో వైఎస్‌ఆర్‌సిపి గెలుపుపై ధీమా!

ysrcp
ysrcp

అమరావతి: సియం కార్యాలయంలో అధికారులు ఎవరుండాలి? ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనే అంశంపై వైఎస్‌ఆర్‌సిపిలో అప్పుడే మంతనాలు ప్రారంభమయ్యాయి. నామినేటెడ్‌ పదవుల ఆలోచనలు కూడా చకచకా సాగుతున్నాయి. ఇక కేబినెట్‌లో స్థానం కోసం ఆశావహులు ప్రయత్నాలు కూడా ప్రారంభించాయి. జగన్‌ కోసం ఆశావహులు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. జగన్‌ వద్దకు ఆయన సన్నిహితుల ద్వారా రాయబారాన్ని పంపుతున్నారు. నేతలతో పాటు అధికారులు కూడా అప్పుడే వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చినట్లు కలలో ఉన్నారు. గెలవబోతున్నామనే ప్రచారాన్ని వైఎస్‌ఆర్‌సిపి విస్తృతం చేసింది.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/