ఆ నాల్గు జిల్లాల్లో వైసీపీ క్లీన్‌ స్వీప్‌

ఏపీలో మరోసారి వైసీపీ పార్టీ తమకు తిరుగులేదు అనిపించింది. శాసన ఎన్నికల దగ్గరి నుండి రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన హావ కనపరుస్తూ వస్తున్న వైసీపీ..జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో గట్టిగానే ఫ్యాన్ గాలి వీచింది. ప్రకాశం, విజయనగరం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో క్లీన్‌ స్వీప్‌ చేసి సైకిల్ కు అడ్రెస్ లేకుండా చేసింది.

ప్రకాశం జిల్లాలో 55 జెడ్పీటీసీ ఎన్నికల్లో 55ను వైసీపీ సొంతం చేసుకుంది. ఇక విజయనగరం జిల్లాలో 34కు 34 జెడ్పీటీసీ స్థానాలు, చిత్తూరు జిల్లాలో 63 జెడ్పీటీసీ స్థానాల్లో , కర్నూలు జిల్లాలో 52 స్థానాల్లో వైసీపీ విజయ కేతనం ఎగురవేసింది. ఇక టీడీపీకి గతంలో మంచి పట్టున్న కుప్పంలోనూ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ హవా కొనసాగింది. నారావారిపల్లిలో చంద్రబాబుకు షాక్‌ తగిలింది. నారావారిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం ఓడారు. 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య గెలిచారు. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఫలితాలతో టీడీపీ షాక్ లో పడితే.. వైసీపీ సంబరాలు చేసుకుంటుంది. చంద్రబాబు ఇక రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది అని వైసీపీ నేతలు అంటున్నారు.