ఏం జాగ్రత్తలు తీసుకున్నారో చెప్పే స్థితిలో ప్రభుత్వం లేదు

ఒమిక్రాన్ ను అరికట్టడంలో ఆరోగ్యశాఖ విఫలమైంది: వర్ల రామయ్య

అమరావతి: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత వర్ల రామయ్య మరోసారి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ అంతంత మాత్రం జోక్యంతో ఒమిక్రాన్ ను అరికట్టడంలో ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు ఎన్నున్నాయో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకున్న జాగ్రత్తలేమిటో చెప్పే స్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు. సీఎం జగన్ వెంటనే స్పందించి ఒమిక్రాన్ కట్టడిపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రజారోగ్యంతో ఆటలొద్దని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/