పోలవరం టెండర్లలో ఎడమకాలువ ప్యాకేజీ-5 పనులు రద్దు


రూ.65 కోట్ల విలువైన టెండర్‌ ఇది

Polavaram project
Polavaram project

అమరావతి: ప్రతిపక్ష టిడిపి ఎంతగా విమర్శిస్తున్నా రివర్స్‌ టెండరింగ్‌తో ముందుకు వెళ్లాలనుకుంటున్న జగన్‌ నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పోలవరం టెండర్లలో మరోదాన్ని రద్దు చేసింది. ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి ప్యాకేజీ5లో 65 కోట్ల రూపాయల విలువైన పనులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పీఎస్కేహెచ్‌ఈఎస్‌ ఇన్ఫ్రా కంపెనీలు ప్రస్తుతం చేస్తున్న పనులకు అగ్రిమెంట్‌ ప్రకారం చెల్లింపులు చేయనుంది. అనంతరం కొత్త ఏజెన్సీలకు పనులు అప్పగించేందుకు వీలుగా టెండర్‌ ప్రక్రియను నిర్వహించనుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/