నేటి సాయంత్రం వైఎస్‌ఆర్‌సిపి జాబితా!

YSRCP
YSRCP

హైదరాబాద్‌: వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిసిన తరువాత జగన్‌ హైదరాబాద్‌ బయల్దేరారు. అయితే ఈరోజు సాయంత్రమే వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థుల జాబితాను ప్రకటిచే అవకాశం ఉంది. కాగా పార్టీలోకి వచ్చే నేతలను చేర్చుకున్న అనంతరం జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ, నెల్లూరుకు చెందిన టిడిపి నేత ఈ సాయంత్రం జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌సిపిలో చేరనున్నారు. వీరితోపాటు టిడిపి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యురాలు వంగా గీత పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా జగన్‌తో భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా వీరిని పార్టీలోకి చేర్చుకున్నాక ఆ పార్టీ అధినేత జగన్‌ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/