బుద్ధా వెంకన్న, బొండా ఉమల కారుపై దాడి

బుద్ధా వెంకన్న, బొండా ఉమల కారుపై దాడి
Incident pic
Bonda uma and Buddha venkanna
Bonda uma and Buddha venkanna

మాచర్ల(గుంటూరు): గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టిడిపి నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమలపై వైఎస్‌ఆర్‌సిపి వర్గానికి చెందిన వారు దాడికి దిగారు. ఈ ఘటనలో వారు ప్రయాణిస్తున్న కారు ధ్వసం అయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైఎస్‌ఆర్‌సిపి అడ్డుకుంటుందనే వార్తలతో.. వాస్తవాలను తెలుసుకునేందుకు వీరు మాచర్లకు వచ్చారు. అయితే వారు వస్తున్నారన్న విషయం తెలిసిన వైఎస్‌ఆర్‌సిపి నాయకులు అడ్డగిండి కారుపై దాడికి దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. అయినప్పటికీ డ్రైవరు కారును ఆపకుండా పోనించాడు, కానీ వారు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. దీంతో మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/