వైఎస్‌ఆర్‌ రైతు భోరసా కార్యక్రమంలో సిఎం

cm jagan
cm jagan

కడప: దివంగత ముఖ్యమంత్రి రాజేశేఖర్‌రెడ్డి తన70 వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాలో ఘనంగా జరిగాయిది. ఏపి ప్రభుత్వం ఈ మహానేత జయంతిని వైఎస్‌ఆర్‌సిపి రైతు దినోత్సవంగా జరుపుతున్న విషయం తెలిసిందే. రైతు దినోత్సవం ప్రధాన కార్యక్రమాన్ని జమ్మలమడుగులో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సభా వేదికపైకి చేరుకున్న సీఎం అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామసుబ్బమ్మ అనే మహిళకు రూ.7 లక్షల చెక్కు అందించి వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాదిమంది రైతులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/