సిఎం జగన్‌ పాలనపై వైఎస్‌ షర్మిల ట్వీట్‌

Y. S. Sharmila
Y. S. Sharmila

అమరావతి: ఏపి సిఎం జగన్‌ బాధ్యతల చేపట్టి నేటికి సరిగ్గా ఆరు నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయనకు తన సోదరి వైఎస్‌ షర్మిల ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఆరునెలలుగా ఏపిలో జగన్‌ చేపట్టిన అనేక సంక్షేమ పథకాలని ప్రస్తావిస్తూ షర్మిల ఓ వీడియోను ట్వీట్‌ చేశారు. అందులో ఆరోగ్యశ్రీ, ఫించన్ల పథకం, వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్‌ దిశగా అడుగులు, మత్స్యకార పథకం, చదువుల విప్లవం, మద్యపాన నిషేధం వంటి అనేక అంశాలు ఇందులో ఆమె ప్రస్తావించారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వానికి మీ చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని, రాష్ట్ర ప్రగతికి వేస్తున్న ప్రతి అడుగులో మీరంతా అండగా నిలవాలని కోరుకుంటున్నానని షర్మిల తెలిపారు. అంతేకాకుండా సిఎం జగన్‌కు ఆయన సొంత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/