నీ బిడ్డలే బిడ్డలు.. ఇతరుల బిడ్డలు బిడ్డలు కాదా?: ష‌ర్మిల‌

బిడ్డకు రెండుసార్లు ఎమ్మెల్సీ ఇచ్చారు

హైదరాబాద్: వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల సీఎం కెసిఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు మ‌రోసారి ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కిన అంశంపై ష‌ర్మిల‌ స్పందించారు. ‘బిడ్డ ఒక్కసారి ఎన్నికల్లో ఓడిపోతేనే కేసీఆర్ గుండె తల్లడిల్లింది. బిడ్డకు రెండుసార్లు ఎమ్మెల్సీ, ఇప్పుడు మంత్రి పదవి కట్టబెట్టేందుకు రెడీగా ఉన్నాడు. నోటిఫికేషన్స్ లేక, ఉద్యోగాలు రాక పురుగుల మందు తాగుడు, ఉరి వేసుకొనుడే ఉద్యోగంగా రోజుకొక్క నిరుద్యోగి చస్తుంటే మాత్రం దొరకు కనపడుతలేదు’ అని ష‌ర్మిల విమ‌ర్శించారు.

‘ఒక్క నెలలోనే ఆరుగురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా నోటిఫికేషన్స్ ఇవ్వాలనే సోయి లేదు దొరకు. నిరుద్యోగులను బలితీసుకొంటున్న హంతకుడు కేసీఆర్. ఇంకెంత మందిని బలితీసుకొంటే ఉద్యోగాలు ఇస్తారు సారూ? నీ బిడ్డలే బిడ్డలు కానీ ఇతరుల బిడ్డలు బిడ్డలు కాదా? వాళ్ల‌ ప్రాణాలు నీకు లెక్కలేదా?’ అని ష‌ర్మిల నిల‌దీశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/