“సారు ఏం చేసినా, ఏం కట్టినా అవినీతి చిట్టాలు, అక్రమాల పుట్టలు”: షర్మిల

సచివాలయంలో గోడలకు బీటలు వచ్చాయన్న షర్మిల

sharmila-satire-on-cm-kcr

హైదరాబాద్‌ః వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కెసిఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ చదివానని చెప్పే అపరమేధావి కెసిఆర్ గారు ఏం కట్టినా మహాద్భుతమేనని వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రపంచం మెచ్చిన కాళేశ్వరం కడితే ఒక్క వరదకే మునిగిందని, దేశం మెచ్చిన యాదాద్రి కడితే చిన్నవానకే చిందరవందర అయిందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రం మెచ్చిన సెక్రటేరియట్ కడితే గోడలకు బీటలు, రెండు జల్లులకే నీటి ఎత్తిపోత… జనం మెచ్చిన పరీక్షలు పెడితే పేపర్ లీకులు… సర్కారు లింకులు అంటూ విమర్శించారు. “సారు ఏం చేసినా, ఏం కట్టినా అవినీతి చిట్టాలు, అక్రమాల పుట్టలు, నాణ్యతకు తిలోదకాలు” అంటూ షర్మిల ఆరోపించారు. సచివాలయ నిర్మాణంపై దర్యాప్తు చేయాలి, భవన నాణ్యతపై పరిశీలన చేయించాలి… రూ.1,600 కోట్ల ఖర్చుపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అని డిమాండ్ చేశారు.