వైఎస్ షర్మిల పార్టీ పేరు, డేట్ ఫిక్స్

వైఎస్సార్ తెలంగాణ పార్టీగా పేరు ఖ‌రారు
జులై 8న పార్టీ ఆవిర్భావ కార్య‌క్ర‌మం

హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పార్టీ పేరుతో పాటు పార్టీ పెట్టబోయే తేదీని కూడా ఈరోజు ఆ పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త రాజ‌గోపాల్ దీనిపై ఓ ప్ర‌క‌ట‌న చేస్తూ… పార్టీ పేరుపై తన‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఎన్నికల‌ సంఘానికి వైఎస్ విజ‌య‌మ్మ లేఖ రాశార‌ని చెప్పారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త నేత‌ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సంద‌ర్భంగా జులై 8న కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్న‌ట్లు ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి అధికారికంగా దీనిపై సంబంధిత ప‌త్రాలు త‌మ‌కు అందాక పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామ‌ని చెప్పారు. పార్టీ ఆవిర్భావానికి అన్ని రకాల ఏర్పాట్లను ఇప్ప‌టికే తాము ప్రారంభించిన‌ట్లు ప్ర‌క‌టించారు.


కాగా, వైఎస్సార్ సంక్షేమ పాలనను తెలంగాణలో మళ్లీ తీసుకు వ‌స్తామ‌ని చెప్పుకొచ్చారు. రాజ‌న్న ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్న‌ట్లు చెప్పారు. ఇప్పటి వరకూ పార్టీ పేరుపై ఎటువంటి అభ్యంతరాలు రాలేదని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/