విశ్వ‌విద్యాల‌యాల్లో పెద్ద ఎత్తున పోస్టుల ఖాళీలు

విశ్వ విద్యాల‌యాల భూముల‌పై టీఆర్ఎస్ నేత క‌న్ను: ష‌ర్మిల‌

హైదరాబాద్: విశ్వ విద్యాల‌యాల భూముల‌పై టీఆర్ఎస్ నేత క‌న్ను ప‌డిందంటూ వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ఆరోప‌ణ‌లు గుప్పించారు. తెలంగాణ‌లోని నిరుద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌తి మంగ‌ళ‌వారం ఆమె నిరాహారదీక్ష చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా నల్గొండ పట్టణంలో దీక్ష చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… బంగారు తెలంగాణ తీసుకువ‌స్తామ‌ని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు బారుల తెలంగాణ, బీరుల తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చారని ఆమె అన్నారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో 33 శాతం పోస్టుల ఖాళీలు ఉన్నాయ‌ని ఆమె తెలిపారు.

రాష్ట్రంలోని ఇత‌ర ఏ వర్సిటీలో చూసినా 63 శాతం ఖాళీలు ఉన్నాయని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను కేసీఆర్ ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఆమె మండిప‌డ్డారు. విద్యార్థులు బాగా చదువుకుంటే వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదా? అని ఆమె ప్ర‌శ్నించారు. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముస్లింలను కూడా కేసీఆర్ మోసం చేశార‌ని ఆమె ఆరోపించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/