వైఎస్ విగ్రహం ధ్వంసం.. తీవ్ర ఉద్రిక్తత

ys-rajasekhara-reddy-statue
ys-rajasekhara-reddy-statue

గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటన గుంటూరు సమీపంలోని కాకుమానులో నిన్న సాయంత్రం జరిగింది. ఇక్కడి చౌరస్తాలో ఏర్పాటు చేసి వైఎస్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. విగ్రహం చేతులు విరిచారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, వైఎస్‌ఆర్‌సిపి నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు డిమాండ్‌ చేయగా, కేసును నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ కెమెరాలు పరిశీలించి, నిందితులను గుర్తిస్తామని హామీ ఇచ్చారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/