తిరుపతిలో ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్!

అమరావతి: ఏపి ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తిరుగులేని విజయం సాధిస్తుంది. ఫ్యాన్ గాలిని తట్టుకోలేక టిడిపి, జనసేన చతికిలపడపోయారు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈసందర్భంగా జగన్ ఏపి సిఎంగా ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారు కోలువున్న తిరుపతిలో జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్ట నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/