ఎక్సైజ్‌ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలి

గ్రామాల్లో బెల్టుషాపులు ఉండకూడదు

ys jaganmohan reddy
ys jaganmohan reddy

అమరావతి: విధి నిర్వహణలో ఎక్సైజ్‌ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యలయంలో ఆయన గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ..గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్టుషాపులు అలాగే మద్యం అక్రమ తయారీ ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దుల్లో అక్రమ ఇసుక రవాణా మద్యం రవాణాలు ఉండకూడదన్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రొహిబిషన్‌ సిబ్బంది అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే బెల్లు షాపులు ఉండకూడదని తెలిపారు. అందుకే గ్రామాల్లో మహిళా పోలీసులను నియమించినట్లు ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. బెల్టుషాపులు నిరోధమే మహిళా పోలీసులు ప్రాథమిక విధి అని సీఎం సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/