మహిళా పక్షపాత ప్రభుత్వం: జగన్

స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం

AP CM YS jagan at the Independence Day celebrations
AP CM YS jagan at the Independence Day celebrations

Vijayawada : మనది మహిళా పక్షపాత ప్రభుత్వ మని,. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించాలన్న లక్ష్యంతో, 44.50 లక్షల తల్లులకు మంచి జరగాలని 85 లక్షల పిల్లలకు మంచి జరగాలని  ఏటా జగనన్న అమ్మ ఒడిద్వారా 6500 కోట్లు చొప్పున, రెండేళ్ళలో ఇప్పటికే రూ.13 వేల కోట్లు  అందజేశామని సీఎం వైఎస్ జగన్ అన్నారు ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. జాతీయ జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు . 1 నుంచి 10 వరకు చదివే పిల్లల సంఖ్య 2018–19తో పోలిస్తే… ప్రై వేట్, గవర్నమెంట్‌ స్కూళ్ళ మొత్తం ఎన్‌రోల్‌మెంట్‌ కలిపి 2018–19లో 70.43 లక్షల నుంచి ఇవాళ 73.05 లక్షలకు కోవిడ్‌ సమయంలో కూడా పెరిగింది. కేవలం ప్రభుత్వ బడుల్నే తీసుకుంటే 2018–19  కాలంలోనే ఎన్‌రోల్‌మెంట్‌… 37.20 లక్షల నుంచి ఇవాళ 43.43 లక్షలకు పెరిగింది. మనం తీసుకున్న విప్లవాత్మక చర్యల వల్ల ప్రతి తల్లిలోనూ, ప్రతి బిడ్డలోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది.  

 వైయస్సార్‌ ఆసరా ద్వారా 8.71 లక్షల డ్వాక్రా  బృందాల్లో ఉన్న 87.75 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే కలిగిన లబ్ధి రూ.6,500 కోట్లు. వైయస్సార్‌ చేయూత ద్వారా 24.56 లక్షల మంది 45 నుంచి 60 యేళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రెండు విడతలుగా అందించిన లబ్ధి  రూ.9,000 కోట్లు.  ఈ సొమ్ముకు బ్యాంకుల ద్వారా మరింత రుణ సదుపాయంతో పాటు, అమూల్, ఐటీసీ, రిలయన్స్‌ వంటి ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలతో టై–అప్‌ కూడా చేసి, అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు మరింతగా చేయూత ఇస్తున్నాం.  

 వైయస్సార్‌–జగనన్న కాలనీల ద్వారా… అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చాం, గృహ నిర్మాణం ద్వారా దాదాపు 1.25 కోట్ల మందికి… అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి లబ్ధి చేకూరుతోంది. ఇప్పటికే ఇళ్ల స్థలాలు చేతికి అందించటమే కాకుండా, మొదటి దశలో 15.60 లక్షల ఇంటి నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి.

 ఈ ఇల్లు పూర్తి అయిన తరవాత ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.5 నుంచి 10 లక్షలు ఉంటుందనుకుంటే… ఈ 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో  అక్షరాలా దాదాపుగా రూ. 2 లక్షల నుంచి – రూ.3 లక్షల కోట్ల సంపదను ఉంచుతున్నాం. 

 వైయస్సార్‌ సున్నా వడ్డీ ద్వారా 1కోటీ 2లక్షల అక్కచెల్లెమ్మలకు రూ. 2,509 కోట్లు అందించాం.   అలాగే… వైయస్సార్‌ కాపు నేస్తం ద్వారా ఇప్పటివరకు 3.28  లక్షల అక్కచెల్లెమ్మలకు రూ.982 కోట్లు లబ్ధి చేకూర్చాం. ఇవి కాకుండా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా జరిగిన మేలును ఇంతకు ముందే వివరించా.

 దేశ చరిత్రలోనే తొలిసారిగా, నామినేటెడ్‌ పదవుల్లో, నామినేషన్‌లో ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం కచ్చితంగా అక్కచెల్లెమ్మలకే ఇచ్చే విధంగా ఏకంగా చట్టాన్నే తీసుకొచ్చిన ప్రభుత్వం మనది.  దీనివల్ల ఈ రోజు వివిధ నామినేటెడ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్ల పదవుల్లో, మున్సిపల్‌–కార్పొరేషన్‌ ఛైర్మన్ల పదవుల్లో 50 శాతం మహిళలే  కనిపిస్తున్నారు.  అక్కచెల్లెమ్మల భద్రతకు ప్రభుత్వం టాప్‌ ప్రయారిటీ ఇచ్చింది. ఆ అక్కచెల్లెమ్మల కోసం ఒక చెల్లిని హోంమంత్రిగా తీసుకురావడమే కాకుండా,  దిశ బిల్లు– దిశ పోలీస్‌ స్టేషన్లు–దిశ పబ్లిక్‌ ప్రాసెక్యూటర్లు, దిశ యాప్‌లకు రూపకల్పన చేసిన ప్రభుత్వం మనది.  కుటుంబాల్లో సంతోషం నింపేలా మద్య నియంత్రణ దిశగా అడుగులు వేసిన ప్రభుత్వం కూడా మనదే…అని సీఎం అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/