గచ్చిబౌలి కారు దుర్ఘటనలో యూట్యూబర్ గాయత్రి మృతి

న్యాయం చేయాలని తల్లి ఆవేదన

youtuber Gayatri -File
youtuber Gayatri -File

Hyderabad: హోలీ రోజున జూనియ‌ర్ ఆర్టిస్ట్, యంగ్ యూట్యూబర్ గాయ‌త్రి , స్నేహితుడు రోహిత్ తో ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం విదితమే. గచ్చిబౌలిలో జరిగిన ఈ ఘటనలో గార్డెనింగ్‌ పనులు చేస్తున్న మహేశ్వరి(38)ని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, తీవ్రంగా గాయపడిన రోహిత్, జూనియర్‌ ఆర్టిస్ట్‌, యూట్యూబర్‌ గాయత్రిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే గాయత్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రోహిత్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.

ఇదిలా ఉండగా, కారు పల్టీ కొట్టగానే అందులోంచి గాయత్రి బయట పడిపోయినట్లుగా సీసీ పుటేజీలో పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై గాయత్రి తల్లి మాట్లాడుతూ రోహిత్‌తో కలిసి కూతురు బయటకు వెళ్లిందని తెలిపారు. ఇపుడు తమను అన్యాయం చేసి వెళ్లిపోయిందని కన్నీటి పర్యంతమైంది. . న్యాయ వ్యవస్థ, పోలీసులు తమకు న్యాయం చేయాలని విన్నవించుకుంది.

జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/