జైశ్రీరాం చెప్పాలంటూ ముస్లిం దంపతులను వేధించిన యువకులు

Bus stand
Bus stand

జైపూర్‌: హర్యానాకు వెళ్లేందుకు బస్సుకోసం వేచి చూస్తున్న దంపతులను జైశ్రీరాం అనాలంటూ వేధించి యువకుల ఉదంతం రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగింది. ముస్లిం దంపతులిద్దరు హర్యానాకు వెళ్లేందుకు అల్వార్‌ బస్టాండ్‌లో భోజనం చేసి బస్సుకోసం వేచి చూస్తుండగా వన్ష్‌ భరద్వాజ్‌, సురేంద్ర భాటియా అనే ఇద్దరు యువకులు ముస్లిం దంపతులను దుర్భాషలాడారు. తరువాత వారిని రామ్‌ – రామ్‌ అని నినదించాలని బలవంత చేశారు.

యువకులు వేధిస్తుండడంతో దంపతులను సహాయం కోసం గట్టిగా కేకలు వేశారు. దాంతో అక్కడికి చేరుకున్న మిగతా ప్రయాణికులు వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. భరద్వాజ్‌, భాటియాల మీద కేసు నమోదైంది. తమ అత్తగారిల్లు దిద్వానా నుంచి నూహ్‌ ప్రాంతానికి వెళేలందుకు అల్వార్‌ బస్టాండ్‌లో తన భర్త కోసం మహిళ వేచి చూస్తుండగా అల్లరి మూక వచ్చి ముస్లింలు భారత్‌లో నివసిస్తారు కానీ రామజపం మాత్రం చేయరంటూ హేళన చేస్తూ దంపతులను వేధించారని పోలీసులు చెప్పారు. మహిళ భర్తను రామ్‌ రామ్‌ అనాల్సిందిగా బలవంత పెట్టగా అతను నిరాకరించడంతో ఇద్దరు వ్యక్తులు అతన్ని చితకబాది అడ్డుకున్న ఆమోపై లైంగికవేధింపుకుల ప్పాడ్డారని, ఇద్దరు వ్యక్తులు బట్టలు విప్పి అసహ్యంగా ఆమెతో ప్రవర్తించారని పోలీసులు వివరించారు. ఇది గమనించిన చుట్టపక్కల వారు అక్కడికి చేరుకుని ఇద్దరు యువకులను చితకబాది పోలీసులకు అప్పగించారు. బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులు ఇద్దరు యువకులపై దాడి చేయడంతో వారు గాయపడ్డారు. వారిని పోలీసులు చికిత్స కోసం అల్వార్‌లోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల నిర్వహించిన అనంతరం పోలీసులు వారిద్దరిని లైంగికవేధింపు కేసు సెక్షన్‌ 354ఎ, మత పరమైన భావాలను దెబ్బతీసినందుకు సెక్షన్‌ 295తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద వారిని అరెస్టు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/