అమెరికాలో హైదరాబాద్‌ వాసి మృతి

Sahith Reddy
Sahith Reddy

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన గొంగళ్ల సాహిత్‌రెడ్డి(25) అమెరికాలోని నార్త్‌ కరోలీనా క్యారిసిట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అయితే భారత్‌ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుఝామున 4.15కు సాహిత్‌రెడ్డి తన ఇంటినుండి జిమ్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అప్పుడు కారును నడిపినవ్యక్తి విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు వచ్చి, మృతుడి వివరాలు సేకరించేసరికి నాలుగు గంటల సమయం పట్టింది. సాహిత్‌రెడ్డి స్నేహితులు హైదరాబాద్ నల్లకుంటలోని పద్మాకాలనీలో ఉంటున్న అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సాహిత్‌రెడ్డి మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్.. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే కేటీఆర్ అమెరికాలోని ఎన్నారై సెల్ ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. సాహిత్‌రెడ్డి మృదేహాన్ని త్వరితగతిన హైదరాబాద్ తరలించడానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు.సాహిత్‌రెడ్డి మృతిచెందిన విషయం ఆలస్యంగా తెలియడంతోపాటు అమెరికా నిబంధనల ప్రకా రం డాక్యుమెంటేషన్‌లో జాప్యం జరిగిందన్నారు. అమెరికాలోని తానా తెలుగు అసోసియేషన్, అక్కడి బంధువులు మృతదేహాన్ని భారత్‌కు తొం దరగా పంపించేందుకు కృషిచేస్తున్నారని అతని మిత్రులు తెలిపారు. మృతదేహం రావడానికి కనీ సం మూడురోజుల సమ యం పడుతుందని భావిస్తున్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/