లోన్ యాప్ వేధింపులకు తెలంగాణ లో మరో యువకుడు బలి

లోన్ యాప్ వేధింపులు ఆగడం లేదు. పోలీసులు కఠిన చర్యలు చేపట్టినప్పటికీ , లోన్ యాప్ యజమానులు మాత్రం ఏమాత్రం భయపడకుండా వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్య లో వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య లు చేసుకోగా..తాజాగా తెలంగాణ లోని కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు బలయ్యాడు.

కరీంనగర్ జిల్లా నగునూరుకు చెందిన శ్రీధర్, పద్మ ల కుమారుడు మని సాయి (19) కి ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాలలో 2 వేల ర్యాంకు వచ్చింది. దీంతో హైదరాబాద్ లోని స్నేహితుడి రూముకు వచ్చి కౌన్సిలింగ్ కు సిద్ధమవుతున్నాడు. అప్పటికే లోన్ యాప్ లో నుంచి రూ. 10 వేలు తీసుకున్న మని సాయి రూ. 50 వేలు కట్టాడు. అయినా వారి వేదింపులు ఆగకపోవడంతో అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎం పాకెట్ అనే లోన్ యాప్ నుండి సాయి లోన్ తీసుకున్నాడు. శంషాబాద్ లో ఉంటూ రేపు కౌన్సెలింగ్ కి హాజరు కావాల్సి ఉండగా.. ఆత్మహత్య చేసుకున్నాడు.