పాతకార్లపైనే యువతకు క్రేజు!

car
car


ఒఎల్‌ఎక్స్‌ సర్వే


న్యూఢిల్లీ: ఒకవైపు కొత్త కార్ల అమ్మకాలు పడిపోతుంటే, పాతకార్ల అమ్మకాలు పెరిగే అవకాశముందని ఒక సర్వేలో వెల్లడైంది. అయితే ప్రీ ఓన్డ్‌ కార్లసేల్స్‌ 2019 సంవత్సరంలో ఏకంగా 10 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రముఖ సంస్థ ఓఎల్‌ఎక్స్‌ పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి పాత కార్త సేల్స్‌ దాదాపు 44 లక్షలను తాకే అవకాశముందని సదరు సంస్థ అంచనా. అయితే 2018లోనే ప్రీ ఓన్డ్‌ కార్ల సేల్స్‌ 40 లక్షలు నమోదు కాగా, అది ఈ సంవత్సరం పెరిగే అవకాశముందని పేర్కొంది. అంతేకాకుండా 2020 నాటికి ప్రీ ఓన్డ్‌ కార్‌ సేల్స్‌ 50 లక్షల మార్క్‌ను అధిగమించే అవకాశముండగా, 2023లో ఏకంగా 66 లక్షల ప్రీ ఓన్డ్‌ కార్‌ సేల్స్‌ నమోదు చేసే అవకాశముందని అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ప్రీ ఓన్డ్‌ కార్ల మార్కెట్‌ దాదాపు 14 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అయితే ఈ పరిశ్రమ 2023 నాటికి 25 బిలియన్‌ డాలర్ల సంస్థగా రూపుదాల్చే అవకాశముంది. ముఖ్యంగా యువత ఎక్కువగా ప్రీ ఓన్డ్‌ కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఆర్థిక మాంద్యం సమయంలో కొత్త కార్ల కన్నా పాత కార్లు తక్కువ ధరలకే రావడంతోపాటు, వీటిపై లోన్‌ సౌకర్యం కూడా కల్పిస్తుండడంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/