నీ ఆట మన దేశానికి ఎంతో అవసరం

Lata Mangeshkar , MS Dhoni
Lata Mangeshkar , MS Dhoni

హైదరాబాద్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడనే వార్తలపై ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ స్పందించారు. ‘హలో ధోనీ, నీవు రిటైర్ కావాలనుకుంటున్నావనే విషయాన్ని వింటున్నా. దయచేసి ఆ దిశగా ఆలోచించకు. నీ ఆట మన దేశానికి ఎంతో అవసరం. రిటైర్మెంట్ గురించి ఆలోచించవద్దని నేను వ్యక్తిగతంగా కోరుతున్నా’ అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి భారీ ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ… ఆయన నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/