హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో యువతి డ్యాన్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు

ప్రస్తుతం కాలంలో ఎక్కడ ఏది జరిగిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం తో వీడియోస్ , ఫొటోస్ , ఇలా ఏదైనా సరే ప్రపంచం మొత్తం చేసేస్తుంది. తాజాగా హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో యువతి చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది. ఇక నెటిజన్లు అయితే అమ్మడి అందానికి, డాన్స్ కు ఫిదా అవుతున్నారు. కాకపోతే మెట్రో అధికారులే ఆగ్రహం తో ఊగిపోతున్నారు.

హైదరాబాద్ నగరానికి తలమానికంగా మారిన మెట్రో రైళ్లలో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. మెట్రో అందుబాటులోకి రావడంతో చాలావరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గాయి. ఈ క్రమంలో కొంతమంది యువతీ యువకులు మెట్రోను బాగా వాడుకుంటున్నారు. రైలు స్టేషన్‌లోకి వచ్చేటప్పుడు సెల్ఫీలు తీసుకోవడం, మెట్రో స్టేషన్లో సినిమా పాటలకు డ్యాన్సులు చేయడం, ఇంకొందరైతే ఆత్మహత్యలకు కూడా మెట్రో స్టేషనే ఎంచుకోవడం గమర్హం.

తాజాగా మెట్రో స్టేషన్‌లో ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మెట్రో స్టేషన్‌లోకి స్నేహితులతో కలిసి వచ్చిన యువతి ప్లాట్‌ఫామ్‌పై ఓ సాంగ్‌కు డ్యాన్స్ చేసి దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అందానికి అందంతో పాటు మోడ్రన్ దుస్తుల్లో రెచ్చిపోయి డ్యాన్స్ చేయడంతో ఆమె టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియో మెట్రో అధికారులకు చేరడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్టేషన్లో డ్యాన్సులు చేయడం మంచి పద్ధతి కాదని, ఆ యువతి ఎవరు, ఏ స్టేషన్లో డ్యాన్స్ చేసిందో గుర్తించి చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ డాన్స్ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.