ఏపీ మంత్రి విశ్వరూప్‌ ఇంటివద్ద కలకలం


ఓ యువతి  పురుగుల మందు తాగడంతో అక్కడి వారు షాక్

suicide
suicide

తూర్పుగోదావరి: కుటుంబ కలహాల నేపథ్యంలో న్యాయం చేయాలంటూ మంత్రికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఏపీ మంత్రి ఇంటి ముందు ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇంటి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఆవేదన చెప్పుకునేందుకన్నట్లు వచ్చిన యువతి హఠాత్తుగా పురుగుల మందు తాగడంతో అక్కడి వారు షాకయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/