చెడు అలవాట్లకు బలవ్ఞతున్న యువత

నే టితరం యువత రోజురోజుకు చెడు అలవాట్లకు చాలా తొందరగా అలవాటుపడుతున్నారు. యువత తమ ప్రధాన లక్ష్యమైన విద్యను పక్కనపెట్టి పెడదారిన సాగుతోంది. విస్తరిస్తున్న విష సంస్కృతి ప్రభావంతో హద్దులు మీరి ప్రవర్తి స్తోంది. దీనికి ఎన్నో సంఘటనలు అద్దంపడుతున్నాయి. సమాజ పోకడలు,మార్పులు వీరిపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. మంచి విషయాల కన్నా చెడు విషయాలు వీరి మనసుల్లో వేగంగా చొచ్చుకుపోతున్నాయి. వింతపోకడలు, విషపు ఆలోచనలు కని పిస్తున్నాయి. ప్రశాంతంతకు చిహ్నంగా నిలిచిన గ్రామాల్లోని యువత సైతం ఈ ప్రమాదాన్ని గ్రహించలేక ఈ విషవలయంలో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం, డ్రగ్స్‌ వాడకం లాంటి అలవాట్లతోపాటుగా స్మార్ట్‌ఫోన్‌ ఫోబియా, ఆన్‌ లైన్‌ జూదం వంటి చెడు అలవాట్లవల్ల నేటి యువత తమ జీవి తాలను దుర్భరం చేసుకుంటున్నారు. మనదేశంలో నేటి యువతే రేపటి భవిత అని చెప్పుకుంటున్న తరుణంలో ఇలాంటి చెడు అల వాట్లవల్ల అదే యువత అనవసరమైన వాటికి బానిసలవ్ఞతున్నా రు. ఆన్‌లైన్‌ షాపింగ్‌వల్ల విచ్చలవిడిగా జల్సాలకు, ఖర్చులకు అలవాటుపడటం, క్రెడిట్‌ కార్డులను అవసరం లేకపోయినా అతిగా వాడటం, అప్పుల పాలవడం, అవి తీర్చలేక అబద్దాలకు, దొంగత నాలకు అలవాటుపడుతున్నారు. మోడ్రన్‌ కల్చర్‌ పేరుతో పెళ్లి కాకుండానే సహజీవనం, పెళ్లయిన తర్వాత అక్రమ సంబంధాలతో గడుపుతున్నారు. అంతేగాక నైతిక పతనం చెంది అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటం జరుగుతోంది. వీరిలో చాలా మంది కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లే యువత ఎక్కువగా ఉండటం విచారించదగ్గ విషయం. సరదాగా మొదలయిన వ్యస నాలు యువతను అనారోగ్యంపాలు చేస్తున్నాయి.సిగరెట్లు,మద్యం అతిగా సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. మానసిక ఒత్తిడికి లోనవడం, తల్లిదండ్రులతో అబద్దాలు చెప్పేలా తయారవ్ఞతున్నారు. వ్యసనాల్లో మునిగిపోయి పరీక్షల్లో తప్పడం, వాటిని మరిచిపోవడానికి మరో అలవాటుకు బానిసవడం సాధా రణంగా తయారవ్ఞతోంది. ఈ క్రమంలో స్వేచ్ఛాయుత జీవనానికి యువతరం ఇట్టే ఆకర్షితులవ్ఞతున్నారు.మద్యం, పరిచయాలు,చెడు స్నేహాలు, అశ్లీలచిత్రాలు ఇలా ఒక్కొక్కటిగా విలువలను నాశనం చేసేలా దిగజారుస్తున్నాయి. ఈ ఆధునిక ప్రపంచంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు చాలామందికి స్మార్ట్‌ ఫోబి యా పట్టుకుంది. కాలేజీల్లోనూ, ట్రాఫిక్‌లోనూ, ఇంట్లో, ఆఖరికి నిద్రపోయే సమయంలోనూ స్మార్ట్‌ఫోన్‌ను వదలటంలేదు.ఉద్యోగం చేస్తున్న సమయాలలో పనిమానేసి చాలామంది సోషల్‌ మీడియా లో ఉంటున్నారు. అంతేగాక ఉద్యోగ నిర్వహణ సమయంలో టిక్‌టాక్‌ వీడియోలు తీస్తూ ఇప్పటికే ఉద్యోగాలు కూడా పోగొట్టు కున్నవారు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనా సమయంలో ఫోను వినియోగం పూర్తిగా నిషేధించినప్ప టికీ ఇది అమలు కావడంలేదు.నేడు సర్వీసులో చేరిన ముఖ్యంగా కొందరు యువ ఉపాధ్యాయులు ఫోన్లతో కాలం గడుపుతూ బోధనా సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇక విద్యార్థుల సంగతి చెప్పనవసరం లేదు. నిత్యం ఫోన్లు వాడుతూ బిజిబిజిగా గడుపు తున్నారు.చాటింగ్‌, గేమ్స్‌, టిక్‌టాక్‌, ఫేస్‌బుక్‌లను కొన్ని గంటల పాటు వాడేస్తున్నారు. బంగారు భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. దీంతో నాణ్యమైన విద్య అందివ్వాలని, విద్యార్థులు మొబైల్‌ ఫోన్లకుబానిసలుగా మారవద్దని ఉత్తరప్రదేశ్‌ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, యూనివర్శి టీల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ నిబంధన బోధించే వారికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. కాలేజీకి వచ్చే విద్యార్థులు చదువ్ఞపై శ్రద్ధ చూపించలేకపోతున్నారని, క్లాస్‌ రూమ్‌ల్లో సైతం మొబైల్‌ ఫోన్లు వినియోగిస్తున్నారు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు, అధ్యాపకులు విలువైన సమయాన్ని చదువ్ఞపై దృష్టి సారించే వీలు ఉంటుందని అభిప్రాయం విద్యాశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అవసరా నికి మించిన స్మార్ట్‌ఫోన్‌ వినియోగం వల్ల అనేకసమస్యలు తలెత్తు తున్నాయి. కాబట్టి పని వేళల్లో ఫోను జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. అందుకే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫోబియా నుండి బయటపడేం దుకు కొన్ని చిట్కాలను పాటించాలి. స్నేహితులతో, బంధువ్ఞలతో కలిసి బయటకు వెళ్లే సమయంలో ఫోన్‌ తీసుకువెళ్లద్దు. లీవింగ్‌ రూమ్‌లోనే ఫోన్‌ వదిలేయాలి. రోజూ లేదా వారంలో గ్యాడ్జెట్స్‌కు ఎంతదూరంగా ఉంటున్నారో ఆ సమయం అంతాకుటుంబ సభ్యు లు, స్నేహితులకు కేటాయించడం ద్వారా ఒత్తిడిలను తగ్గించుకోవ చ్చు. వృధాగా కాలక్షేపానికి వినియోగించే సమయాన్ని ఆదా చేస్తే ఉద్యోగానికి న్యాయం చేయటమేకాక మిగిలిన సమయాన్నియువత తమ లక్ష్యసాధనకు, వృత్తినైపుణ్యాలను పెంచుకోవడంతోపాటు ప్రవృత్తులను పెంచుకోవడానికి కొంత సమయాన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి వినియోగించవచ్చు. ఆల్కహాల్‌ను నేటియువత అమితంగా ఇష్టపడుతున్నారు.మద్యంకోసం ఎంతకైనా తెగిస్తున్నారు.నిత్యం మద్యపానం చేయడం వల్ల ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయని తెలిసినా వాటిని వదలలేకపోతున్నారు. మద్యానికి బదులు నీళ్లను ఎక్కువగా తాగాలి. ఇష్టమైన వాళ్లతో మాట్లాడాలి. అప్పుడు ప్రయోజనం ఉంటుంది. అలాగే ధూమపానం వల్ల కలిగే ప్రభావాలను ప్రతి సినిమాషోలో ప్రకటనలు వేసి మరీ చూపించి నా యువకుల మనసులు మారడంలేదు.పైగా ఈ మధ్య సిగరెట్‌ లో మాదకద్రవ్యాలను నింపుకుని మరీ పొగ తాగుతున్నారు. వీటిని మానేయాలంటే ప్రతిరోజూ 8 గ్లాసుల నీటిని తప్పని సరిగా తీసుకోవాలి. అలాగే మైండ్‌ను డైవర్ట్‌ చేయాలి.

  • ఆత్మకూరు భారతి

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/