రాజధానిలో యువకుడి ఆత్మహత్యాయత్నం

తూళ్లూరు: ఏపికి మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత రైతుల నిరసనలకు దిగారు. కాగా ఈ ఆందోళనలు 25వ రోజుకి చేరిన విషయం తెలిసిందే. ఒకపక్క రైతుల అరెస్టులతో రాజధాని ప్రాంతాలు అట్టుడికి పోతున్న సమయంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజధానిలో కలకలం రేపింది. వివరాల్లోకెళితే.. ఎప్పటిలాగే తూళ్లూరులో మహధర్నా శిబిరంలో రైతులు దీక్షలు చేస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు, పోలీసులు అది గమనించడంతో అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన యువకుడి పేరు జానీగా గుర్తించారు. అయితే రాజధాని తమ ప్రాంతం నుంచి తరలిపోతుందని మనో:వేధనకు గురైన ఆ యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/