కూతురిని ప్రేమించాడని యువకుడిని నరికిన తండ్రి

చిత్తూరు జిల్లాలో పరువు హత్య

young man murdered
young man murdered

Chittor District: ఏపీలో పరువు హత్య జరిగింది. కూతురిని ప్రేమించాడని ఒక యువకుడిని ఆ యువతి తండ్రి నరికి హతమార్చాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో సంచలనం కలిగించింది. అయితే ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత యువకుడి మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసారు. గ్రామానికి చెందిన యువకుడు ధనశేఖర్, శైలజ రెండేళ్లుగాప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. శైలజ తండ్రి ధనశేఖర్ ను మాట్లాడాలని తన పొలానికి పిలిపించాడు. ధనశేఖర్ ను అక్కడే హత్య చేశాడు. ధనశేఖర్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పూడ్చిపెట్టాడు.

ఆ తర్వాత ధనశేఖర్ కనిపించకపోవడంతో అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధనశేఖర్ ఫోన్ లో చివరిసారిగా శైలజ తండ్రి మాట్లాడినట్లు నిర్ధారించారు. దీని ఆధారంగా పోలీసులు విచారణ జరిపి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. యువకుడి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ధనశేఖర్‌ మాట వినకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు శైలజ తండ్రి అంగీకరించాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/