సికింద్రాబాద్ కాల్పుల్లో మరో యువకుడి ఆరోగ్యం విషమం..

సికింద్రాబాద్ కాల్పుల్లో మరో యువకుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు గాంధీ డాక్టర్స్ చెపుతున్నారు. ఛాతిలో బుల్లెట్ దిగడం తో ఆ యువకుడి ఆరోగ్యం మరింత విషమంగా ఉందని డాక్టర్స్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కు చెందిన వినయ్ గా పోలీసులు గుర్తించారు. ఇంటర్ పూర్తి చేసిన లంకం వినయ్..ప్రస్తుతం ఆర్మీ జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే పోలీసుల కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడు మృతిచెందాడు. అత‌డిని ఖానాపురం మండ‌లం ద‌బీర్‌పేట‌కు చెందిన రాకేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేర‌కు పోలీసులు రైల్వే అధికారులు స‌మాచార‌మిచ్చారు. పరీక్షా రాసి వస్తానని చెప్పి రెండు రోజుల క్రితం హైదరాబాద్ కు వెళ్లాడని , ఇప్పుడు శవంగా తిరిగివస్తున్నాడని రాకేష్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా యువ‌త ఆందోళ‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. గత నాల్గు రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆర్మీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేస్తూ తమ నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ లో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన ఉద్రికతకు దారితీసింది. పలు రైళ్లకు నిప్పు పెట్టడం , స్టేషన్ ను ధ్వసం చేయడం తో పోలీసులు లాఠీచార్జి చేసారు. ఈ క్రమంలో పోలీసులపై విద్యార్థులు రాళ్ల దాడి చేయడం తో , పోలీసులు వారిపై కాల్పులు జరిపారు.

ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిరసన తెలుపుతున్న ఆందోళనకారుల్ని పోలీసులు వారిని చర్చలకు ఆహ్వానించారు. 10 మంది ఆందోళనకారుల్ని చర్చలకు పిలిచారు. వారిని ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసర్ వద్దకు తీసుకెళ్తామని అంటున్నారు. అయితే ఆందోళనకారులు మాత్రం ఆర్మీ రిక్రూట్మెంట్అధికారి వద్దకు అందరం వస్తామని పట్టుబడుతున్నారు. అందుకు పోలీసులు నిరాకరించారు.