చిత్రసీమలో రాణిస్తున్న తెలంగాణ యువ డైరెక్టర్స్

ఒకప్పుడు చిత్రసీమలో ఎక్కువగా ఆంధ్ర వారే ఉండేవారు..డైరెక్టర్స్ , నటి నటులు , నిర్మాతలు ఇలా దాదాపు చిత్రసీమలో వారే ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సినీ కళాకారులు తమ సత్తాను చాటుతున్నారు. రీసెంట్ గా సిరిసిల్ల జిల్లాకు చెందిన వేణు..బలగం తో భారీ విజయాన్ని అందుకొని నేషనల్ లెవల్లో గుర్తింపు సాధించాడు. తెలంగాణ నేపధ్య కథను ఎంచుకొని చక్కని సెంటిమెంట్ , కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమలు , కోపాలు , పల్లెల్లో ఉండే అందాలు ఇలా అన్ని చక్కగా వెండితెర ఫై చూపించి సక్సెస్ అయ్యాడు.

తాజాగా దసరా తో మరో తెలంగాణ యువ డైరెక్టర్ శ్రీకాంత్ వార్తల్లో నిలిచాడు. నాని – కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ నిన్న శ్రీరామ నవమి కానుకగా పాన్ ఇండియా లెవల్లో విడుదలై భారీ హిట్ కొట్టింది. మొదటి సినిమాతోనే శ్రీకాంత్ మెగా హిట్ కొట్టేసరికి అందరు ఈయన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. శ్రీకాంత్ కరీంనగర్ జిల్లాలోని సింగరేణి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి సినిమా నిర్మాణం, స్క్రీన్ రైటింగ్ పట్ల ఆసక్తి ఉండడంతో సినీరంగం వైపు అడుగులు వేశాడు. 2016లో టూ ఫాదర్ విత్ లవ్ షార్ట్ ఫిల్మ్ కు ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. ఆతర్వాత సుకుమార్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశారు. సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీకాంత్.. ఇప్పుడు దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. రాబోయే రోజుల్లో మెగా ఫోన్ పట్టుకోవడం ఖాయం అంటున్నారు. ఇలా తెలంగాణ నుండి అద్భుతమైన డైరెక్టర్స్ వెలుగులోకి వస్తుండడం తో తెలంగాణ ప్రజలు , సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.