జపాన్ కొత్త ప్రధానిగా యొషిహిడే ఎన్నిక

టోక్యో: జపాన్ నూతన ప్రధానిగా యొషిహిడే సుగా బుధవారం నాడు ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్ డైట్‌లో జరిగిన ఎన్నికలో ఆయన గెలుపొందారు. అనారోగ్య కారణాల రీత్యా మునుపటి ప్రధాని షింజో అబే తన పదవికి రాజీనామా చేయడంతో.. యొషిహిడే ఈ బాధ్యతలు చేపట్టారు. కాగా, జపాన్ దిగువసభలో ఓటింగ్‌లో మొత్తం 462 మంది సభ్యులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. అందులో 314 ఓట్లు యొషిహిడేకు అనుకూలంగా పడ్డాయి. నేషనల్ డైట్‌లో అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ)కి మెజారిటీ ఉండటంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయ్యింది. ఓటింగ్‌లో యొషిహిడే గెలుపొందినట్లు స్పీకర్ తడమొరి ఒషిమా ప్రకటించారు. దీంతో సుమారు ఎనిమిదేండ్ల తర్వాత జపాన్‌కు కొత్త ప్రధాని ఎన్నికయినట్లు అయ్యింది.
మరి కాసేపట్లో సుగా తన క్యాబినెట్ సభ్యుల పేర్లను కూడా ప్రకటించనున్నారు
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/