పెరుగు .. శరీరానికి చాలా అవసరం

ఆహారం- ఆరోగ్యం

Yogurt is very necessary for the body

చాలామందికి పెరుగన్నం తినందే భోజనం పూర్తయిందన్న భావన కలగదు.. కానీ ఈ తరం అమ్మాయిలు పెరుగును ఇష్టపడటం లేదు.. అసలే తినని వాళ్ళూ వున్నారు.. కానీ పెరుగు శరీరానికి చాలా అవసరం.. పెరుగు తింటే ఎన్ని లాభాలో, తినకపోతే ఎన్ని నష్టాలో చూద్దాం

నెలసరి అమ్మాయిలు బలహీనంగా ఉంటారు.. ఖ్పుడు పెరుగు తప్పక తినాలి.. ఇందులో క్యాల్షియం, పొటాషియం, మేగ్నెసియం, జింక్, భాస్వరం, విటమిన్ బి 12, ప్రోటీన్లు, ఉన్నందున ఇది మంచి పోషకాహారం… విటమిన్ డెఫిషియన్సీ సమస్య తలెత్తదు..

పెరుగు కంటే మజ్జిగ మంచిది.. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కు ఇది ఔషదం గా పనిచేస్తుంది.. ఇందులో వున్నా ఈస్ట్ నోటి పూతను తగ్గిస్తుంది.. ఎముకలు, దంతాలను దృడంగా ఉంచుతుంది.. చర్మానికి కాంతి తెస్తుంది. ఆకలిని పెంచుతుంది.. జీర్ణ ప్రక్రియను వృద్ధి చేసి మలబద్దకాన్ని అరికడుతుంది .. నిద్రలేమి సమస్యను నివారిస్తుంది..

పెరుగు గుండె జబ్బును, మధుమేహాన్ని అరికడుతుంది.. ఊబకాయులు పాలు తగ్గించి పెరుగు వాడటం వల్ల ఫలితం ఉంటుంది..

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.. కనుక అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.. పెరుగు తినని వాళ్లలో రక్తపోటు ఎక్కువని, అలాగే ఇన్సులిన్ శాతం కూడా తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది..

పెరుగును పేస్ ప్యాక్ గా వేసి అరగంట తర్వాత కడిగితే ముఖం మెరుపులీనుతుంది.. తలకు కండీషనర్ గా వాడటం వాళ్ళ జుట్టు రాలటం, చుండ్రు తగ్గుతాయి..

సొర , బీర మొదలైన కూరల్లో రుచి కోసం పెరుగు వేస్తారు.. పెరుగుతో బంగాళాదుంప కుర్మా చేస్తారు.. దీంతో చేసే పచ్చళ్ళు వున్నాయి. . దద్దోజనం, మజ్జిగ చారుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.. ఏ కూరలూ సిద్ధంగా లేవంటే కాస్తంత పెరుగన్నం తిన్నా కడుపులో దండిగా ఉంటుంది.. అందువల్ల ఏదో రూపంలో పెరుగు ను తప్పక తీసుకోండి..

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/