ఈ నెల 25న రెండోసారి సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారం

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ని విజయపథంలో నడిపించిన యోగి ఆదిత్యనాథ్.. మార్చి 25న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను సాధించింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉంటే బీజేపీ కూటమి 273 స్థానాల్లో గెలుపొంది. వరసగా రెండోసారి అధికారంలో చేపట్టేందుకు సిద్ధమైంది. ఈనెల మార్చి 25న సాయంత్రం 4 గంటలకు యూపీ సీఎంగా యోగీ ఆదిత్యానాథ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు అవుతారని తెలుస్తోంది.

సీఎం యోగి ప్రమాణస్వీకారాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.అందుకు ఆహ్వానితుల జాబితాను సిద్ధం చేస్తోంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో మార్చి 25 సాయంత్రం 4 గంటలకు ఈ వేడుక జరగనుంది. స్టేడియం 50,000 మంది ప్రేక్షకులకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు స్టేడియంలో దాదాపు 200 మంది VVIP లకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్షాలతో సహా ఇతర ప్రముఖ నేతలు హాజరుకానున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/