శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యానికి యోగా

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సతీమణి ఉషమ్మతో కలిసి సోమవారం ఉపరాష్ట్రపతి నివాసంలో యోగా సాధన చేశారు. ‘యోగాతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్న ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాభ్యాసం చేయాలన్నారు. శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యానికి యోగా ఉత్తమ మార్గమని అన్నారు. దీనిద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవవచ్చని తెలిపారు. యోగాను ప్రతిఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీనివల్ల శాంతి, సామరస్యం పెరుగుతాయని తాను నమ్ముతున్నానని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/