సాధువులతో కలిసి బాబా రాందేవ్‌ ఫిర్యాదు

Baba Ramdev
Baba Ramdev


హైదరాబాద్‌: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శ సీతారాం ఏచూరి గరువారం భోపాల్‌లో జరిగిన ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో హిందువులు కూడా హింసా ప్రవృత్తిగలవారేనని, రామాయణ, మహాభారతాల్లో కూడా హింస ఉన్నదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై యోగా గురువు బాబా రాందేవ్ త‌ప్పుప‌ట్టారు. ఆయ‌న ఇత‌ర సాధువుల‌తో క‌లిసి ఇవాళ హ‌రిద్వార్‌లో సీతారం ఏచూరిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దేశంలోని ఎంతో మంది రాజులు, రాజ్యాల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. రామాయణ, మహాభారతాలు కూడా మొత్తం హింస, యుద్ధాలతోనే నిండి ఉన్నాయి. హింసతో నిండిన హిందూ పురాణాల గురించి మీ ప్రచారంలో ప్రస్తావిస్తూ.. హిందువులు హింసకు వ్యతిరేకమని ఎలా చెప్తారు? అని  సీతారాం ఏచూరి ప్ర‌శ్నించారు. 


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/