ఆందోళనలో యెస్ బ్యాంకు డిపాజిటర్లు
యెస్ బ్యాంక్ ఖాతాదారులు ఎవరూ 50,000 వేలకు మించి తీసుకోరాదు

ముంబయి: నిధుల కొరత ఎదుర్కొంటున్న యెస్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆ బ్యాంకు ఖాతాదారులు డబ్బు విత్ డ్రా కోసం యెస్ బ్యాంకు ఏటీఎంల ముందు బారులు తీరారు. యెస్ బ్యాంకు ఖాతాదారులెవరూ తమ ఖాతాల నుంచి నెలకు రూ. 50,000 వేలకు మించి విత్ డ్రా చేసుకునేందుకు వీల్లేదని పేర్కొంది. ఆర్బీఐ ఆదేశాలతో ఆందోళన చెందిన డిపాజిటర్లు డబ్బు విత్ డ్రా కోసం ఏటీఎంల ముందు బారులు తీరినా వారికి డబ్బు రాలేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వార ఖాతాలోని డబ్బును ఆన్లైన్లో పంపిద్దామనుకుంటే అది కూడా సాధ్యంకాలేదు. దీంతోపాటు ముంబయి నగరంతో పాటు పలు నగరాల్లోని యెస్ బ్యాంకు ఏటీఎం ముందు జనం డబ్బు విత్ డ్రా కోసం బారులు తీరారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/