విమానాశ్రయంపై క్షిపణి దాడి, 26 మందికి గాయాలు

missile attack
missile attack


సౌదీ అరేబియాలోని ఓ విమానాశ్రయంపై యెమెన్‌కు చెందిన హౌతి రెబల్స్‌ వైమానికి దాడులకు పాల్పడ్డారు. ఆ మిస్సైల్‌ దాడితో 26 మంది పౌరులు గాయపడ్డారు. బుధవారం ఉదయం అబా ఎయిర్‌పోర్టుపై మిస్సైల్‌ దాడి జరిగింది. లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా పేల్చినట్లు హౌతి రెబల్స్‌ తెలిపారు. యెమెన్‌లో హౌతి రెబల్స్‌ నాలుగేళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఐతే ప్రభుత్వానికి సౌదీ కూటమి దేశాలు మద్దతిస్తున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/