యెమెన్‌లో సౌదీ దాడులు..31 మంది మృతి

Saudi jet crash
Saudi jet crash

యెమెన్‌: యెమెన్‌పై సౌదీ దళాలు మైమానిక దాడులు జరిపాయి. ఈ దాడిలో 31 మంది పౌరులు మృతి చెందారు. యెమెన్ ఉత్తర ప్రావిన్సులోని అల్ జాఫ్ ప్రాంతంలో హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. సౌదీ నేతృత్వంలోని దళాలు జెట్ విమానాన్ని కూల్చేశాయి. అంతకుముందు రోజు సౌదీ జెట్ విమానం ఒకటి కూలిపోయింది. దీనిని తామే కూల్చేసినట్టు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. దీంతో సౌదీ ఈ ప్రతీకార దాడులకు దిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 31 మంది పౌరులు మృతి చెందారని, మరో 12 మంది గాయపడ్డారని ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. అయితే, సౌదీ మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/