సాయంత్రం యడ్యూరప్ప ప్రమాణస్వీకారం

గవర్నర్‌తో యడ్యూరప్ప భేటీ

Yeddyurappa
Yeddyurappa

బెంగళూరు: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో బిజెపి అధికారం చేపట్టేందుకు వీలైంది. ఈ సందర్భంగా బిజెపి ఇప్పుడు ఓ అడుగు ముందుకేసింది. బిజెపి సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇవాళ గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ ఉదయం రాజ్‌భవన్‌కు వచ్చిన ఆయన.. గవర్నర్‌ వాజూభాయ్‌ వాలాతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఈ రోజే అవకాశం ఇవ్వాలని యడ్డీ కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు గవర్నర్‌ కూడా అంగీకరించారన్నారు. నేడు యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణం చేసే అవకాశం ఉంది.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/