అమూల్యపై దేశద్రోహం కేసు నమోదు

అమ్యూలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయి: కర్ణాటక సీఎం

YEDDYURAPPA
YEDDYURAPPA

బెంగళూరు: బెంగళూరులో సీఏఏ వ్యతిరేక సభలో అమూల్య లియోన్ అనే యువతి పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దాంతో ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ అంశంపై కర్ణాటక సీఎం యెడియూరప్ప స్పందించారు. ​అమూల్య లియోన్ కు గతంలో మావోయిస్టులతో సంబంధాలున్నాయని, ఆమెకు బెయిల్ లభించే అవకాశాలు దాదాపు లేనట్టేనని స్పష్టం చేశారు. అమూల్య వెనుక ఉన్న సంస్థలు ఏమిటో దర్యాప్తుతో వెలుగులోకి వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. గట్టి చర్యలు తీసుకోకపోతే ఇలాంటి సంస్థలకు అడ్డుకట్టపడదని యెడియూరప్ప అభిప్రాయపడ్డారు. కాగా ఈకార్యక్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/